‘RPL: రాంకీ ప్రీమియర్ లీగ్’ రెండవ సీజన్‌ను ప్రారంభించిన రాంకీ ఎస్టేట్స్

శ్రీ MSK ప్రసాద్ గ్రాండ్ సెర్మనీలో ట్రోఫీని ఆవిష్కరించారు
కమ్యూనిటీలను ఏకం చేసే క్రికెట్ మహోత్సవం
క్రీడా స్ఫూర్తి, సమాజ స్ఫూర్తి మరియు తమ రెసిడెన్షియల్ కమ్యూనిటీల లోపల నిర్మించబడిన బలమైన సంబంధాల వేడుక, RPL : రాంకీ ప్రీమియర్ లీగ్, 2వ సీజన్‌ను ప్రారంభించినట్లు రాంకీ ఎస్టేట్స్ వెల్లడించింది. ఇది కేవలం క్రికెట్ టోర్నమెంట్ కంటే ఎక్కువ, గోడలకు అతీతంగా జీవనశైలిని పెంపొందించడానికి రాంకీ నిబద్ధతను RPL ప్రతిబింబిస్తుంది – ఇది నివాసితులను ఒకచోట చేర్చుతుంది, శాశ్వత జ్ఞాపకాలను మరియు అర్థవంతమైన సంభాషణలను సృష్టిస్తుంది. RPL యొక్క 2వ సీజన్‌ను రాడిసన్ గచ్చిబౌలిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ క్రికెటర్ మరియు BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ శ్రీ MSK ప్రసాద్ ప్రారంభించారు. మాజీ భారత క్రికెటర్ MSK ప్రసాద్ , గ్రూప్ సిఎఫ్ఓ శ్రీ ఎన్ఎస్ రావు మరియు ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ శరణ్ అల్ల సాంప్రదాయ జ్యోతి ప్రకాశనం చేయటంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఇది ఐక్యత, క్రీడా స్ఫూర్తి మరియు తమ ఇళ్ల సరిహద్దులకు మించి కుటుంబాల కలయికను సూచిస్తుంది.
గత సంవత్సరం టోర్నమెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, RPL మరింత మెరుగ్గా, ఉత్తమంగా తిరిగి వచ్చింది, 12 కమ్యూనిటీల నుండి 16 జట్లు 31 మ్యాచ్‌ల ఉత్తేజకరమైన ఫార్మాట్‌లో పాల్గొంటాయి. ఫిబ్రవరి 15, శనివారం నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో నాలుగు క్వార్టర్-ఫైనల్స్, రెండు సెమీ-ఫైనల్స్ మరియు మార్చి 8న జరిగే ఒక గ్రాండ్ ఫినాలేతో సహా ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు జరుగుతాయి. MSK ప్రసాద్ ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ టోర్నమెంట్ కు వేదికగా ఉండనుంది , ఇది నివాసితులకు ప్రొఫెషనల్ లీగ్‌లను ప్రతిబింబించే అధిక-నాణ్యత ఆట అనుభవాన్ని అందించనుంది.
క్రికెట్‌కు మించి RPL యొక్క మహోన్నత ప్రభావాన్ని వెల్లడించిన రాంకీ గ్రూప్ సిఎఫ్ఓ శ్రీ ఎన్ఎస్ రావు మాట్లాడుతూ “రామ్కీ ఎస్టేట్స్ వద్ద , మేము మా నివాసితులలో మనం అనే భావనను పెంపొందించడాన్ని నమ్ముతాము. RPL కేవలం ఒక టోర్నమెంట్ కాదు; ఇది మేము నిర్మించే బలమైన సమాజానికి ప్రతిబింబం – ఇక్కడ ఇరుగు పొరుగువారు సహచరులుగా మారతారు మరియు స్నేహాలు వారి ఇళ్ల గోడలకు మించి విస్తరిస్తాయి. ఈ కార్యక్రమం, రియల్ ఎస్టేట్‌కు మించి సమగ్రమైన, అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీలను సృష్టించాలనే మా లక్ష్యం కు అనుగుణంగా ఉంటుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో RPL ఎందుకు ప్రత్యేకంగా నిలిచింది అనే అంశమై రాంకీ ఎస్టేట్స్ రీజినల్ డైరెక్టర్ శ్రీ శరణ్ అల్ల తన ఆలోచనలను పంచుకుంటూ : “రాంకీ వద్ద , ఇళ్ళు కేవలం నాలుగు గోడల కంటే ఎక్కువ అని మేము నమ్ముతాము – అవి సంబంధాలు వికసించే, కమ్యూనిటీలు వృద్ధి చెందే మరియు అనుభవాలు పంచుకునే ప్రదేశాలు. RPL కేవలం క్రికెట్ గురించి కాదు; ఇది ప్రజలను ఒకచోట చేర్చడం, స్నేహాన్ని పెంపొందించడం మరియు చురుకైన మరియు ఆకర్షణీయమైన జీవనశైలిని గడుపుతూ మా నివాసితులకు కొత్త స్నేహాలను సృష్టించుకునే అవకాశాన్ని ఇవ్వడం గురించి” అని అన్నారు.
ఈ ఉత్సాహాన్ని మరింతగా పెంచుతూ మాజీ అంతర్జాతీయ క్రికెటర్ మరియు BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ శ్రీ MSK ప్రసాద్ ఈ తరహా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. “ప్రజలను ఏకం చేయటం లో క్రీడలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి. ఉమ్మడి అభిరుచి ద్వారా కమ్యూనిటీలు ఎలా కలిసి రాగలవనే దానికి అద్భుతమైన ఉదాహరణ, RPL. మైదానంలో ఈ నివాసితులు పోటీ పడటం, సహకరించుకోవడం మరియు మద్దతు ఇవ్వడం చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం. రాంకీ ఎస్టేట్స్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రశంసనీయం, ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్‌కు మించి సుసంపన్నమైన జీవన అనుభవాన్ని సృష్టించడం పై దృష్టి పెడుతుంది”అని అన్నారు.
ఈ సంవత్సరం, RPL పగలు మరియు రాత్రి మ్యాచ్‌ల మిశ్రమాన్ని కూడా పరిచయం చేస్తుంది, ఆటగాళ్లకు మరియు ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని ఇది పెంచనుంది . గ్రూప్ దశ మ్యాచ్‌లు పగటిపూట జరుగుతాయి, ఫైనల్స్ ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరుగడం ద్వారా పోటీ యొక్క ఉత్కంఠను పెంచుతాయి.
10,000 కంటే ఎక్కువ కుటుంబాలు టోర్నమెంట్‌లో చురుకుగా పాల్గొంటున్నందున, RPL అనేది కమ్యూనిటీ-ఆధారిత జీవనంపై రాంకీ నమ్మకానికి నిదర్శనం. గత సంవత్సరం, 12 జట్లు పాల్గొన్నాయి మరియు ఈ సీజన్‌ను 16 జట్లకు విస్తరించడం నివాసితులలో నిరంతరం పెరుగుతున్న ఆసక్తిని ప్రదర్శిస్తుంది. టోర్నమెంట్ ముగుస్తున్న కొద్దీ, ఇది కేవలం క్రికెట్ గురించి మాత్రమే కాదు – ఇది జట్టుగా పోరాడటంలోని విజయవంతమైన గాథలు , టోర్నమెంట్ వెలుపల సంతోషంగా ఉన్న కుటుంబాల నవ్వులు మరియు ప్రతి మ్యాచ్‌తో లోతుగా పెరిగే బంధాల గురించి ఉంటుంది.
‘ ఇళ్ల కంటే ఎక్కువ సృష్టించడం – కమ్యూనిటీలను సృష్టించడం’ అనే తమ సిద్దాంతానికి రాంకీ ఎస్టేట్స్ కట్టుబడి ఉంది. RPL వంటి కార్యక్రమాల ద్వారా, ప్రతి నివాసి అనుబంధాలు బలోపేతం అయ్యే జీవనశైలిని మరియు జీవితాన్ని పూర్తిగా జీవించే జీవనశైలిని అనుభవించేలా చూసుకోవడానికి కంపెనీ కట్టుబడి ఉంది.