రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నారైల పెట్టుబడి
అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు ఇప్పుడు తమ పెట్టుబడులను భారతదేశంలో రియల్ ఎస్టేట్‌పై పెడుతున్నారు. వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్‌కు ఉన్న డిమాండ్‌ను దష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో రియల్టీ రంగంలో ఎన్నారైల పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోవైపు డాలర్ విలువ పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత, భౌగోళిక పరిస్థితులు, ఇండియాలో సరళీకృత పన్ను విధానాలు, రెరా, జీఎస్టీలతో స్థిరాస్తి రంగంలో పెరిగిన పారదర్శకత, డిజిటల్ లావాదేవీల సౌలభ్యం, సులువైన ఆస్తి నిర్వహణ, పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు, అధిక లాభాలు, పన్ను మినహాయింపులు, సరళీకృత పన్ను విధానాలు అందుబాటు ధరలు.. వంటి రకరకాల కారణాలు కూడా ఎనఆరఐలను భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు పెట్టేలా చేస్తోంది.
అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మధ్యకాలంలో డిమాండ్ తగ్గడం కూడా ఇండియాలోని రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నారైల దష్టి పడటానికి కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంతో పాటు న్యూ జెర్సీ, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నారైలు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఆస్తులను కొనుగోలు చేయడం ఈ మధ్యకాలంలో భారీగా పెరిగింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలను చూస్తే అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్న ఎన్నారైలు ఆచితూచి అడుగు వేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో అమెరికాలో ఆస్తులను కొనుగోలు చేయడం చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారంగా మారుతుందని స్థానిక ఎన్నారైలు భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో భారతీయ ఎన్నారైలు ఇప్పుడు భారతదేశంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కొన్ని వార్త కథనాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎన్నారైలు తమ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో తమ పెట్టుబడులను పెట్టెందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు భారతీయ రియల్ ఎస్టేట్ రంగంపై అమెరికాలోని ఎన్నారైలతోపాటు ఇతర దేశాల ఎన్నారైలు కూడా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో ఎనఆరఐల వాటా 2015లో 7–10 శాతంగా ఉండగా.. 2025 నాటికి 18–20 శాతానికి పెరిగింది. 2024–25లో దేశీయ గృహ విభాగంలోకి ప్రవాసులు 85,000 నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో నివాసం ఉంటున్న సిటీకి చెందిన ఎనఆరఐలు రూ.3 కోట్లు, ఆపై విలువ ఉన్న ప్రాపర్టీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024–25లో నగరంలో ప్రవాసులు రూ.6,800 కోట్లు–రూ.10,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువగా ఉండటం ప్రవాసులకు కలిసొస్తుంది. కొంత కాలంగా స్థిరాస్తి మార్కెట్లో ఆశించిన జోరు లేకపోవడంతో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఎనఆరఐలు భావిస్తున్నారు. దీంతో విదేశాల్లో ఇంటి రుణాలు తీసుకొని మరీ నగరంలో ఉంటున్న వారి తల్లిదండ్రులకు పంపించి ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. విల్లాల కంటే ఫ్లాట్ల కొనుగోళ్లకే ప్రవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉండటం, అద్దె కూడా వస్తుండటం దీనికి ప్రధాన కారణాలు. పైగా నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. కోట్లు వెచ్చించి విల్లా కొనుగోలు చేసినా.. త్వరగా అద్దెకు పోదు. అందుకే అపార్ట్మెంట్ల కొనుగోళ్లకే ఎనఆరఐలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారని చెబుతున్నారు.






