US: భారతదేశంలో ప్రాపర్టీ కావాలనుకునే ఎన్నారైలకు శుభవార్త..

అమెరికాకు వచ్చేస్తున్న ‘గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్‌పో 2025’
స్వదేశంలో రియల్ ఎస్టేట్ (Real Estate) లో పెట్టుబడి పెట్టాలనుకునే భారతీయ-అమెరికన్లకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మనం కాంటాక్ట్ చేసిన బిల్డర్ లేదా కంపెనీని నమ్మొచ్చా? దాని రెప్యుటేషన్ ఎలా ఉంది? వాళ్లు చూపిస్తున్న ప్రాపర్టీ నిజంగానే లాభదాయకమైన ప్రదేశంలో ఉందా? ఇలా ఎన్నో అనుమానాలు, భయాలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ప్రదేశంలో సమాధానం దొరికితే ఎలా ఉంటుంది? దానికి తోడు భారతదేశంలోని బెస్ట్ బిల్డర్లు, కంపెనీలు వచ్చి తమ ప్రాజెక్టులను వివరిస్తే?… అసలు ఇదంతా నిజంగా జరుగుతుందా? … అనిపిస్తోంది కదా. దానికి మా దగ్గర ఉన్న సమాధానం సింపుల్‌గా ‘యస్’. భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కలిసి సిలికాన్ వ్యాలీ నడిబొడ్డున ఈ ఏప్రిల్ నెలలో .. పెట్టుబడి పెట్టాలనుకునే భారతీయ అమెరికన్లకు ఒక అద్భుతమైన అవకాశం అందించనున్నాయి.
మైస్క్వేర్‌ఫీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్‌పో 2025’కు ముహూర్తం ఖరారైంది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఎక్స్‌పో జరగనుంది. ఈ కార్యక్రమం.. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న యూఎస్‌లోని ఎన్నారైల ముందుకు రానుంది.
వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, మౌలిక సదుపాయాల్లో పెరుగుతున్న పెట్టుబడులు, అలాగే నాణ్యమైన ఇళ్లు, కమర్షియల్ స్పేసెస్‌కు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టిని భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన డెవలపర్‌లను కలవడానికి, వారితో మాట్లాడి అత్యుత్తమమైన ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను గుర్తించడానికి అమెరికన్ ఎన్నారైలకు ఈ ఎక్స్‌పో ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది.
‘‘ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు – ఇది భారతీయ డెవలపర్‌లకు, అంతర్జాతీయ భారతీయ సమాజానికి మధ్య ఒక వారధి’’ అని మైస్క్వేర్‌ఫీట్ బృందం తెలిపింది. ‘‘మేము ఈ ఎక్స్‌పో కోసం 20కి పైగా భారతదేశంలోని ప్రముఖ డెవలపర్‌లను ఎంపిక చేశాం. ఈ కంపెనీలు రు అపార్ట్‌మెంట్లు, విల్లాల నుండి ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, వాణిజ్య ప్రాజెక్ట్‌ల వరకు అన్నిరకాల ప్రాపర్టీలను అందిస్తున్నారు,’’ అని మైస్క్వేర్‌ఫీట్ టీం వెల్లడిరచింది.
బ్యాంకింగ్ భాగస్వామి – ఐసీఐసీఐ బ్యాంక్
ఈ డెవలపర్‌లు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, అహ్మదాబాద్, ఢల్లీి ఎన్సీఆర్, కోచి, గోవా, మైసూరు, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కోల్‌కతా వంటి భారత్‌లోని మరెన్నో ప్రధాన నగరాల్లోని ప్రీమియం ప్రాజెక్ట్‌లను రిప్రజెంట్ చేస్తారు. మీకు స్టైలిష్ సిటీ అపార్ట్‌మెంట్ కావాలా? లగ్జరీ విల్లా లేదా మంచి రిటర్న్స్ ఇచ్చే కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? మీ అవసరం ఏదైనా సరే ఈ కంపెనీలు మీ ఆలోచనలకు సరిపోయే ప్రాపర్టీని మీకు నచ్చిన బడ్జెట్‌లో చూపించడం ఖాయం.
ఎక్స్‌పోలో పాల్గొనే బిల్డర్లు..
అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్ గ్రూప్, ఎంఎస్‌ఎన్ రియాల్టీ, త్రిదాస రియాల్టీ, సుమధుర ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎస్‌బీఎల్, రామ్‌కీ ఎస్టేట్స్ డ ఫార్మ్స్, రాధే కన్‌స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ డ ఇన్‌ఫ్రా, టోటల్ ఎన్విరాన్‌మెంట్, బిర్లా ఎస్టేట్స్, కిషోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఇంకా మరెన్నో సంస్థలు.
ఎక్స్‌పోకు రావడం వల్ల కలిగే లాభాలు..
* భారతదేశంలోని అగ్రశ్రేణి డెవలపర్‌లను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది.
* రియల్ ఎస్టేట్ చట్టాలు, ఫైనాన్సింగ్ ఎంపికలు, ఎన్నారై ట్యాక్స్ ప్రయోజనాల గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు.
* ప్రత్యేకమైన ఎక్స్‌పో-ఓన్లీ ఆఫర్‌లు, ఎర్లీ బర్డ్ డీల్స్ దొరుకుతాయి.
* మీకు పెద్దగా ఐడియా లేని సిటీలు, ప్రాజెక్టుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
* ప్రవేశం పార్కింగ్ ఉచితం – ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అందరూ ఎక్స్‌పోకు రావచ్చు.
* మీరు భారతదేశంలో స్థిరపడాలని ప్లాన్ చేస్తున్నా, అద్దె ఆదాయం కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్నా లేదంటే స్వదేశంతో ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యుండాలని అనుకుంటున్నా – గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్‌పో 2025 – మీ కలను నిజం చేయడానికి ఒక అద్భుతమైన వేదికను అందిస్తుంది.
మరిన్ని వివరాల కోసం లేదా ముందుగా నమోదు చేసుకోవడానికి:
www.mysftindia.com వెబ్‌సైటును సంప్రదించండి. లేదా
925-913-8049 ప 508-901-9759 ప ం91-90522-64545 నెంబర్లకు కాల్ చెయ్యండి.
లేదా events@mysftindia.com కు ఈమెయిల్ చెయ్యొచ్చు.