Rera: జీహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్ మరో మైలురాయి: ‘దికాస్కేడ్స్ నియోపోలిస్’ కు రేరా గ్రీన్ సిగ్నల్

జీహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి(GHR Lakshmi Urbanblocks Infra LLP) తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘దికాస్కేడ్స్ నియోపోలిస్’కు (The Cascades Neopolis) రెరా అనుమతి పొందింది. ఈవిషయాన్ని సంస్థ గర్వంగా ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో 7.34 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈప్రాజెక్టు 63 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ఉంది. దీని రెరానంబర్ P02400009538. ఈ అనుమతి ద్వారా సంస్థ పారదర్శకత, చట్టపరమైన నిబంధనలు, వినియోగదారుల నమ్మకానికి కట్టుబడి ఉంటుందని తెలిపింది.
ఈ ప్రాజెక్టులో 1,189 అద్భుతమైన, పర్యావరణ అనుకూల గృహాలు, 10 ట్రిప్లెక్స్ పెంట్ హౌస్లు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు యూహెచ్ఏ లండన్, కూపర్స్ హిల్ (సింగపూర్), స్టూడియోహెచ్బీఏ (సింగపూర్) దీనిని రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతతో, ప్రపంచ స్థాయి డిజైన్ తో ఈప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇదివెల్ప్రీ-సర్టిఫైడ్, ఐజీబీసీప్రీ-సర్టిఫైడ్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, అంతర్జాతీయ కాన్సియెర్జ్ సేవలు వంటి ప్రత్యేకతలున్నాయి. ఆరోగ్యం, స్థిరత్వం, స్మార్ట్ లివింగ్ అనే మూడు అంశాల చుట్టూ ఈప్రాజెక్టు నిర్మితమవుతోంది.
కొనుగోలుదారులు ప్రాజెక్టును సందర్శించడానికి వీలుగా కోకాపేటలో సేల్స్ లాంజ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి భాగస్వామి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ రెరా అనుమతి మేము నాణ్యతకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. హైదరాబాద్ లో పట్టణస్థలాన్ని పునర్నిర్వచించడానికి మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైన విజయం” అన్నారు.
లక్ష్మీ ఇన్ఫ్రా భాగస్వామి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, “దికాస్కేడ్స్ నియోపోలిస్” కు రెరా అనుమతి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పారదర్శకత, సృజనాత్మకత, వినియోగదారుల ప్రాధాన్యతలతో కూడిన గృహాలను అందించాలనే మాకలను ఇది నిజం చేస్తుంది” అని అన్నారు.
అర్బన్ బ్లాక్ రియల్ భాగస్వామి శరత్ మాట్లాడుతూ, “రెరా అనుమతి మాకృషికి గుర్తింపు. నిబంధనలు, స్థిరత్వం, సృజనాత్మకతతో కూడిన ప్రాజెక్టును సృష్టించడం ద్వారా గృహనిర్మాణ రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పాలని మేము లక్ష్యంగాపెట్టుకున్నాము” అని తెలిపారు.
ఈ ప్రాజెక్టు ప్రధాన వ్యాపారకేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతరసౌకర్యాలకు చేరువలో ఉంది. విలాసవంతమైన సౌకర్యాలు, నగర కేంద్రంలో ఉండటంవల్ల, ఇది గృహ కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు మొదటి ఎంపికగా నిలుస్తుందని భావిస్తున్నారు.