DSR: డీఎస్ఆర్ బిల్డర్స్ ఆకాశమే హద్దుగా స్కై మార్క్
రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన శైలిలో ప్రాజెక్టులను నిర్మించి ప్రత్యేకతను చాటుకున్న డీఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ హైదరాబాద్‌లో కూడా విభిన్న ప్రాజెక్టులతో ఆకట్టుకుంటున్నది. దాంతోపాటు కస్టమర్లకు ఉపయోగపడేలా తన ప్రాజెక్టులను తీర్చిదిద్దటంతోపాటు, పట్టణ జీవనశైలిని సుస్థిరమైన, ఆకర్షణీయమైన మరియు ఆహ్లాదకరమైన ప్రాజెక్టులుగా తనది ఉండాలని భావిస్తూ నిర్మిస్తోంది. తన ప్రాజెక్టు నిర్మాణాలు సంప్రదాయానికి ప్రతీకగా ఉంటూనే, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కూడా తీర్చిదిద్దటం సంస్థ ఆశయం. విశ్వసనీయత – పునాది: నమ్మకం, నాణ్యత మరియు సంఘీభావం వంటి సంప్రదాయ విలువలపై ఆధారపడిన బలమైన రియల్ ఎస్టేట్ సంస్థగా డిబిఆర్ బిల్డర్స్ కనిపిస్తుంది. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, విదేశీ సాంకేతిక నైపుణ్యం, పర్యావరణహిత నిర్మాణ ప్రమాణాలకు సంస్థ మారుపేరుగా నిలిచి ఉంది. ప్రతి నిర్మాణంలోనూ కఠినమైన నాణ్యత పరీక్షలను నిర్వహిస్తూ, వినియోగదారులకు అత్యుత్తమ ఫలితాలను సంస్థ అందిస్తోంది. దానికితోడు ఉన్నత విద్యావంతులు, అపార అనుభవం ఉన్న నిపుణుల బృందం డిఎసఆర్ బిల్డర్స్ డెవలపర్స్‌కు ప్రధాన బలం అని చెప్పవచ్చు.
‘స్కై మార్క్’
ఘనమైన చరిత్ర, వారసత్వం ఉన్న భాగ్యనగరిలో ఉన్న వారికి కేంద్రబిందువుగా, నగరపు వేగాన్ని, ఉత్సాహాన్ని సరికొత్తకోణంలో ఆస్వాదించాలనుకునే వారికి ‘స్కై మార్క్’ ఒక అద్భుత వేదికగా చెప్పవచ్చు. అక్షరాలా ఆకాశానికి చేరువగా నివసిస్తున్నామనే అనుభూతిని ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్‌లకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్ట్ సైట్ ఓ.ఆర్.ఆర్ ఫేసింగ్‌ను కలిగి ఉంది. నివాసితుల సౌకర్యార్థం ఉత్తర మరియు తూర్పు దిశల నుండి రెండు వైపులా అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. ఇక్కడి నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 30 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చు. ఐటీ నిపుణులకు, వ్యాపారవేత్తలకు ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో ఈ ప్రాజెక్టు ఉంది.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు:
44 టవర్లు, 4జి. ప్లస్ 40 అంతస్తులు, 47.11 ఎకరాల్లో నిర్మాణం, 4664 యూనిట్లు 4ప్రీమియం అపార్టుమెంట్లు 43,999 స్క్వేర్ ఫీట్ 44,999 స్క్వేర్ ఫీట్ 45,454 స్క్వేర్ ఫీట్లలో నిర్మాణం..
ప్రత్యేకతలు
అత్యున్నత జీవనశైలి, అత్యాధునికత నిర్మాణం, అద్భుతమైన వ్యూ, సరికొత్త నిర్మాణ శైలి, విలాసవంతమైన ఇంటీరియర్స్, విశాలమైన క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, ఫిట్నెస్ సెంటర్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, మల్టీ-పర్పస్ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్ సౌకర్యం, విశాలమైన పార్కింగ్, కాన్ఫరెన్స్ రూమ్, డీలక్స్ గెస్ట్ రూమ్స్, కాఫీలాంజ్, లైబ్రరీ, మూవీ థియేటర్, మెడిటేషన్ హాల్, పెట్ పార్క్, పార్టీ లాన్, యాంఫి థియేటర్, స్పా, సెలూన్ వంటి సౌకర్యాలు ఇందులో కనిపిస్తాయి.
15 సంవత్సరాలుగా మేము ఈ రంగంలో ఉన్నాము. ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాము. నమ్మకం, విశ్వసనీయత, సమగ్రత అనే పునాదులపై కంపెనీ ఏర్పాటైంది. పర్యావరణ అనుకూలమైన నిర్మాణాలు, నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్మాణాలను చేపట్టడం ద్వారా వేలాదిమంది కస్టమర్లకు దగ్గరయ్యాము. అలాగే మారుతున్న అభిరుచులకు అనుగుణంగా నేటితరానికి నచ్చేలా, కస్టమర్లతో దీర్ఘకాలిక బంధాలను పెంచుకునేలా, నాణ్యత, నమ్మకానికి విలువనిచ్చి ప్రాజెక్టులను నిర్మిస్తుంటాము. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఈ స్కై మార్క్ అందరినీ నచ్చేలా ఉంటుంది. ల్యాండ్ మార్క్‌గా కూడా కనిపించేలా ప్రాజెక్టు తయారవుతోంది.
డి. రఘురామిరెడ్డి – మేనెజింగ్ డైరెక్టర్






