Crystal Garden: మహావీర్ కన్ స్ట్రక్షన్స్ అందిస్తున్న క్రిస్టల్ గార్డెన్
రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన శైలిలో ప్రాజెక్టులను చేపడుతూ, వాటిలో సాటిలేని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ మహావీర్ కన్ స్ట్రక్షన్స్ సంస్థ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. సౌకర్యవంతమైన మరియు మెరుగైన జీవనశైలిని అందించే సంస్థల్లో ఒకటిగా ఈ సంస్థ నిలిచింది. తన ప్రాజెక్టులను అన్నీ వర్గాలకు ఉపయోగపడేలా నిర్మిస్తూ, అందులో ఎనలేని సౌకర్యాలను కల్పిస్తూ, కమ్యూనిటీకి దగ్గరైంది. సమర్థవంతమైన నాయకత్వంతో, ఈ సంస్థ తనకంటూ ఒక బలమైన విజన్‌ను మరియు ప్రతిష్టాత్మకమైన వృద్ధి పథాన్ని నిర్దేశించుకుంది. 1998లో ఏర్పాటైన మహావీర్ కన్ స్ట్రక్షన్స్, ప్రాజెక్ట్ డెలివరీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది.
మా ప్రాజెక్టులు అనేక చోట్ల ల్యాండ్‌మార్క్‌లుగా, మరికొన్ని చోట్ల అత్యుత్తమ ప్రమాణాలకు చిహ్నాలుగా కనిపిస్తాయి. హైదరాబాద్‌లోని వివిధ కీలక ప్రాంతాలలో అత్యాధునిక వసతులతో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టింది. మహావీర్ క్రిస్టల్ గార్డెన్ (కొత్తూరు), మహావీర్ హోరిజోన్ – కోకాపేట్, మహావీర్ రేడియన్స్- హైటెక్ సిటీ, మహావీర్ టర్కోయిస్, మహావీర్ సెలెస్ట్ వంటి ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది. సాధారణంగా ఈ కంపెనీ అందరికీ అనుకూలమైన ప్రాంతాల్లోనే ప్రాజెక్టులను నిర్మిస్తోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్లకు లేదా వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్తూరు వంటి ప్రాంతాలకు దగ్గరగా ఉండేలా ప్రాజెక్టులను నిర్మిస్తోంది.
క్రిస్టల్ గార్డెన్
వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్తాపూర్ పరిసరాల్లో ఉన్న క్రిస్టల్ గార్డెన్ కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా లగ్జరీ జీవనశైలిని తదుపరి స్థాయికి సంస్థ తీసుకువెళ్ళింది. 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్, అత్తాపూర్‌లో విశాలమైన 3 మరియు 4 బెడ్రూం అపార్ట్మెంట్లను అందిస్తోంది. ప్రతి ఇల్లు ఎంతో నైపుణ్యంతో, పరిపూర్ణంగా తీర్చిదిద్దబడింది. క్రిస్టల్ గార్డెన్లో సాటిలేని వసతులు ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ హై-రైజ్ టవర్లను మహావీర్ క్రిస్టల్ గార్డెన్ మీ ముందుకు తెస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రీమియం సౌకర్యాలు మరియు విశాలమైన క్లబ్‌హౌస్ మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఈ ప్రాజెక్టులో మరో విశేషం కూడా ఉంది. మహావీర్ క్రిస్టల్ గార్డెన్ ఒక పచ్చని ఒయాసిస్ లాంటిది — ఇది ఎల్లప్పుడూ పచ్చదనంతో, ఉత్సాహంగా మరియు సజీవంగా ఉంటుంది. స్టైలిష్‌గా జీవించడానికి క్రిస్టల్ గార్డెన్ మాత్రమే సరైన వేదిక అని చెప్పవచ్చు.
ముఖ్యాంశాలు
* 5 ఎకరాల విస్తీర్ణం, జిప్లస్ 35 ఫ్లోర్లు, 2 ప్లస్ 1 టవర్
* 60,000 స్క్వేర్ఫీట్లలో ప్రీమియం క్లబ్ హౌజ్
* బిజినెస్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, ప్రైవేట్ థియేటర్, గేమ్స్ రూమ్
* బాంక్వెట్ హాల్, రెస్టారెంట్, ఎంటర్టైన్మెంట్ రూమ్, లైబ్రరీ, మ్యూజిక్ స్టూడియో
* సూపర్ మార్కెట్, కేఫ్, ఇండోర్ గేమ్స్, ఔట్ డోర్ గేమ్స్, పార్టీ జోన్
కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా…
హైదరాబాద్, బెంగళూరులలో వేలాది మంది కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా అపార్టుమెంట్లు, హైరైజ్ బిల్డింగ్స్ లను నిర్మించి ఇచ్చిన అనుభవంతో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టాము. స్ఫూర్తినిచ్చే ఇళ్ళను నిర్మించడం, అందులో కస్టమర్లు సంతృప్తిగాఉండటం అన్న లక్ష్యంతో మేము ప్రాజెక్టులను చేపట్టాము. నగరం మధ్యలో ప్రాజెక్టులను చేపట్టినప్పటికీ, ప్రశాంతతను అందించేలా ఓపెన్ స్పేస్ మరియు పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తూ నిర్మాణాలు చేపట్టడం మా ప్రత్యేకత. అలాగే నేటి యువతరానికి, మారుతున్న అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మా ప్రాజెక్టులను అందుకు తగ్గట్టుగా నిర్మించడంతోపాటు ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల వివరాలను కస్టమర్లకు తెలియజేస్తున్నాము. రోజువారీ జీవనశైలిని మెరుగుపరిచేలా, ఆలోచనాత్మకమైన డిజైన్‌తో, ప్రీమియం నాణ్యత కలిగిన సరసమైన ఇళ్లను అందిస్తూ వస్తున్నాము. క్రిస్టల్ గార్డెన్ ప్రాజెక్టు కూడా అందరికీ నచ్చేలా రూపొందించడం జరిగింది. ఎన్నో సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
మేడా నిశాంత్ రెడ్డి
మేనెజింగ్ డైరెక్టర్






