బెంగళూరులో ఆవాస్ ప్రాజెక్ట్

బాలాజీ డెవలపర్స్ సంస్థ బెంగళూరులో ప్రీమియం నివాస సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వైట్‌ఫీల్డ్‌లో ఇప్పటికే 4 ప్రాజెక్ట్‌లలో కలిపి సుమారు 600 ప్లాట్లను పూర్తి చేసిన ఈ సంస్థ, ఇప్పుడు ఆవాస్ పేరిట నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. 1.80 లక్షల చ.అ.ల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 125 ప్లాటుంటాయని కంపెనీ ఎండీ అరవింద్ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్ట్‌లో 44 యూనిట్లు 2 బీహెచ్‌కే, మిగిలినవి 3 బీహెచ్‌కే యూనిట్లుంటాయి. 1,254 నుంచి 1,770 మధ్య ప్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రస్తుతం శ్లాబ్, బ్రిక్ వర్క్ నడుస్తోంది. ధర. చ.అ.కు రూ.5వేలు .ఇదే ప్రాంతంలో ఈ ఏడాది ముగింపులోగా మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది.. 2 ఎకరాల్లో 200 యూనిట్లు వస్తాయి. నిర్మాణ అనుమతుల దశలో ఈ ప్రాజెక్టు ఉందని కంపెనీ తెలిపింది.