ASBL: హైదరాబాద్ రియాలిటీలో స్తబ్దత కొనసాగుతున్నప్పటికీ ప్రీ-లాంచ్ సమయంలోనే రూ. 1000 కోట్ల అమ్మకాలపై దృష్టి సారించిన ASBL బ్రాడ్‌వే

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సుప్రసిద్ధ బిల్డర్ అయిన ఏఎస్ బి ఎల్(ASBL), ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ ప్రీమియం రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ, బ్రాడ్‌వే ను జూన్ 14న ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమైన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఆమోదాన్ని ఇటీవల పొందింది. ఇందులో G+50 అంతస్తులతో మూడు టవర్లు, 2035 నుండి 2650 చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలోని 885 విలాసవంతమైన 3 BHK ఫ్లాట్‌లు ఉంటాయి. ఇవి డిసెంబర్ 2029 నాటికి కొనుగోలుదారులకు అప్పగించబడతాయి.
నివాసితుల కోసం ప్రత్యేకమైన జీవన అనుభవాన్ని సృష్టించడానికి వినూత్నమైన డిజైన్ అంశాలు.
ఏఎస్ బి ఎల్ యొక్క కొత్త సిరీస్ న్యూయార్క్ లోని ఒక పట్టణం అయిన మాన్‌హట్టన్ నుండి ప్రేరణ పొందినప్పటికీ, భారతీయ కుటుంబాల యొక్క వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్ రూపొందించబడింది. రాబోయే తరాలను ఆకట్టుకునే రీతిలో భవిష్యత్ కు సిద్దమైన గృహాలను అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్, ఇండోర్ మరియు అవుట్‌డోర్ ప్రాంగణాలను సజావుగా ఏకీకరణ చేస్తుంది, మూడు-వైపుల గాజు రెయిలింగ్‌లతో కూడిన విశాలమైన బాల్కనీలను కలిగి ఉంటుంది, ఇవి నగరం యొక్క అందాలను నిరంతరం వీక్షించే అవకాశం అందిస్తాయి. విశ్రాంతి మరియు మనఃశాంతిని పొందటానికి సరైన ప్రాంగణంను సృష్టిస్తాయి. ఈ అవుట్‌డోర్ లివింగ్ నేపథ్యం అరుదైన పట్టణ ప్రాంగణాన్ని అందిస్తుంది, ఇండోర్ సౌకర్యాన్ని అవుట్‌డోర్ స్వేచ్ఛతో మిళితం చేస్తుంది.
అదనంగా, ప్రాజెక్ట్ యొక్క కర్టెన్ వాల్ డిజైన్, పూర్తి ఫ్లోర్-టు-సీలింగ్ విండోలతో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ యొక్క అబ్జర్వేటరీ తరహా వీక్షణలను అందిస్తుంది. ఈ ఆకర్షణీయమైన అంశం, విశాల ప్రాంగణమనే భావనను పెంచుతూ , ఇండోర్‌లను అవుట్‌డోర్‌లతో సజావుగా కనెక్ట్ చేస్తూ లగ్జరీని జోడిస్తుంది. ఆధునిక లగ్జరీని ఆచరణాత్మకతతో కలిపే ప్రత్యేకమైన జీవన అనుభవాన్ని సృష్టించడానికి ఈ వినూత్న డిజైన్ అంశాలు సమిష్టిగా పనిచేస్తాయి.
భారతదేశంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడికి పశ్చిమ హైదరాబాద్ ఆకర్షణ గతంలో కంటే బలంగా ఉంది.
ఇటీవలి కాలంలో భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్వల్పంగా మందగించినప్పటికీ, భారతదేశపు మొత్తం నివాస అమ్మకాలకు హైదరాబాద్ గణనీయంగా తోడ్పాటునందిస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో దాని ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది. అనరాక్ క్యు 1, 2025 నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో 10,300 కొత్త యూనిట్లు ప్రారంభించబడ్డాయి మరియు 10,100 యూనిట్లు కూడా అదే కాలంలో అమ్ముడయ్యాయి. అలాగే, కుష్మాన్ & వేక్‌ఫీల్డ్ వెల్లడించే దాని ప్రకారం, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ ప్రాంతం 2025 మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌లో మొత్తం కొత్త నివాస ప్రారంభాలలో 51% వాటాను కలిగి ఉంది, ఇది నగరంలో మార్కెట్ లీడర్‌గా ఈ ప్రాంత స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది .
అధునాతన మౌలిక సదుపాయాలు, కొనసాగుతున్న మరియు రాబోయే నివాస ప్రాజెక్టుల శ్రేణితో, పశ్చిమ హైదరాబాద్ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశంలోనే పెట్టుబడికి అత్యంత లాభదాయకమైన ప్రాంతాలలో ఒకటిగా కొనసాగుతోంది. ఏఎస్బిఎల్ యొక్క బ్రాడ్‌వే వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకుంటున్న ప్రీమియం, హై-ఎండ్ విభాగాలలో (ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో) కొనుగోలుదారుల ఆసక్తి బలంగా ఉంది. ఇక ఆశ్చర్యపోనవసరం లేని అంశం ఏమిటంటే, ప్రస్తుత ప్రీ-లాంచ్ దశలో కూడా ఈ ప్రాజెక్ట్ కాబోయే కొనుగోలుదారుల నుండి అద్భుతమైన ప్రతిస్పందనను అందుకుంటోంది.
రాబోయే ప్రాజెక్ట్ గురించి ఏఎస్ బి ఎల్ వ్యవస్థాపకుడు & సీఈఓ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ “2015 నుండి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కన్సల్టింగ్ సంస్థ అయిన మెర్సర్, హైదరాబాద్‌ను భారతదేశంలో అత్యున్నతంగా జీవించదగిన నగరంగా ఆరుసార్లు స్థిరంగా ర్యాంక్ ఇచ్చింది. ఈ మహోన్నత నగరం అనేక సంవత్సరాలుగా అందిస్తున్న ప్రశాంతత, భద్రత, విశ్వవ్యాప్త దృక్పథం, స్వేచ్ఛ మరియు జీవన నాణ్యత గురించి ఇది ఎంతో చెబుతుంది. ఏఎస్బిఎల్ బ్రాడ్‌వేతో, మేము నగరం యొక్క సామర్థ్యాన్ని మరింతగా బయటకు తీసుకురావాలని, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో ఈ సామర్ధ్యం వెలుపలికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రముఖ ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రధాన వ్యాపార కేంద్రాలతో కూడిన ప్రదేశం, పశ్చిమ హైదరాబాద్. ఇది గృహ కొనుగోలుదారులకు ఆదర్శవంతమైన ఎంపికగా మారింది. సంక్షిప్తంగా, బ్రాడ్‌వే అనేది అపరిమిత జీవన అనుభవాలు, సౌకర్యం మరియు విలాసాన్ని కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కమ్యూనిటీ” అని అన్నారు.