ASBL: ఏఎస్బీఎల్ మరో ప్రాజెక్ట్ స్పెక్ట్రా
హైదరాబాద్‌కు చెందిన ఏఎస్బీఎల్ ఒక వినూత్నమైన.. వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ సంస్థ. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీగా గుర్తింపు పొందింది. రియల్ ఎస్టేట్ రంగంలోని పాత పద్ధతులను చెరిపివేసి, ఇళ్ల నిర్మాణ శైలిలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఆవిర్భవించింది. తన నిర్మాణాల్లో ‘డిజిటల్ ట్విన’ వంటి ఆధునిక సాంకేతికతను మరియు డేటా అనలిటిక్స్‌ను ఉపయోగిస్తుంది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఉండే డిజైన్లు, అత్యున్నత నిర్మాణ ప్రమాణాలు మరియు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారాన్ని అందించడం ద్వారా వేలాదిమంది కస్టమర్లను ఈ సంస్థ ఆకట్టుకుంది. కేవలం ఇళ్లను నిర్మించడమే కాకుండా, ప్రజల జీవనశైలిని బట్టి డిజైన్లను మార్చడం ఈ సంస్థ ప్రత్యేకత. ఉదాహరణకు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా రెండు మాస్టర్ బెడ్రూమ్లు ఉండేలా ‘టూ మాస్టర్ బెడ్‌రూమ’ కాన్సెప్ట్‌ను వీరే ప్రవేశపెట్టారని అంటారు. ఇప్పటివరకు సుమారు 10 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది. హైదరాబాద్‌లో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టింది. కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసింది. కొన్ని నిర్మాణదశల్లో ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్ రామ్‌గూడ లో అత్యంత విలాసవంతంగా నిర్మితమవుతున్న ప్రాజెక్ట్ ఇది. సుమారు 7.85 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రీమియం నివాస ప్రాజెక్ట్ ఇది. గేటెడ్ కమ్యూనిటీలో ప్రత్యేకమైన ప్రాజెక్టుగా ఇది నిర్మితమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ పద్ధతులను పాటించి అందరికీ నచ్చే డిజైన్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. హైరైజ్ టవర్ల నుంచి చూస్తే నగర అందాలను తిలకించేలా ఈ ప్రాజెక్టు కనిపిస్తుంది. ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండటం వల్ల గాలి వెలుతురు ఎక్కువగా ప్రసరిస్తుంటుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కంపెనీ 50`50 పేమెంట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ముఖ్యంగా రెడీ టు మూవ్ ఇళ్ళను కొనేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఈ పథకం ప్రకారం మీరు బుకింగ్ సమయంలో ఫ్లాట్ మొత్తం ధరలో సగభాగాన్ని అంటే 50శాతం చెల్లించాలి. మిగిలిన సగభాగాన్ని ఫ్లాట్ స్వాధీన సమయంలో చెల్లించాలి.
ప్రత్యేకతలు
* 7.85 ఎకరాల్లో నిర్మాణం…
4 టవర్లు, జి ప్లస్ 39 అంతస్థులు,
3 బెడ్ రూమ్‌లు
* రూమ్-సైజ్ బాల్కనీలు:
* భారీ క్లబ్‌హౌస్: జిమ్, స్పా.
ఇండోర్ గేమ్స్
* బాస్కెట్‌బాల్, బాడ్మింటన్ కోర్టులు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు.
* స్విమ్మింగ్ పూల్, ఇవి ఛార్జింగ్:
కనెక్టివిటీ…
* ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కనే
* ఐటీ హబ్‌కు దగ్గరగా..
కస్టమర్ల టేస్టుకు తగ్గట్టుగా..
మా ప్రాజెక్టులు ఎప్పుడూ కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఉండే డిజైన్లు, అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో కనిపిస్తుంటాయి. దానికితోడు ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారాన్ని అందించడం ద్వారా మా కస్టమర్ల నమ్మకాన్ని పొందుతుంటాము. సంస్థపై కస్టమర్లు చూపుతున్న నమ్మకం.. రేపటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంతో అభిరుచితో నిర్మించడానికి మాకు కావలసిన గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుంటాయి. ఈ ప్రాజెక్టు కూడా కస్టమర్ల టేస్టుకు తగ్గట్టుగా నిర్మితమవుతోంది. విలాసవంతమైన, విశాలమైన టవర్లలో నివాసం మీకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని మేము ఆశిస్తున్నాము.
అజితేశ్ కొరుపోలు, ఫౌండర్, సిఇఓ.






