Moduli: మోడ్యులర్ నిర్మాణంలో కొత్త విప్లవం: మోడ్యూలీ ఆవిష్కరణ!
నిరంతరం మారుతున్న నేటి ప్రపంచంలో, నిర్మాణ రంగం కూడా అదే వేగంతో పరిణామం చెందాలనే లక్ష్యంతో, మోడ్యూలీ (MODULI) సంస్థ భారతదేశ నిర్మాణ రంగాన్ని వినూత్నంగా మారుస్తోంది. ఈ సంస్థ ప్రీమియం మోడ్యులర్ నిర్మాణంలో అగ్రగామిగా నిలుస్తూ, భవనాలను వేగంగా, తెలివిగా, మరింత స్థిరంగా నిర్మిస్తోంది. దశాబ్దాల యూరోపియన్ నిర్మాణ నైపుణ్యం కలిగిన ప్రఖ్యాత సంస్థ మొరావియా (MORAVIA) సహకారంతో మోడ్యూలీని స్థాపించారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, యూరోపియన్ ఇంజనీరింగ్ కచ్చితత్వం, అధునాతన సాంకేతికతలను భారతీయ నిర్మాణ రంగానికి పరిచయం చేసి, సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఎన్సీఎల్ (NCL) గ్రూప్, హౌస్ ఆఫ్ మొరావియా కలిసి ఈ లక్ష్యాన్ని సాధించాయి.
హైదరాబాద్‌లోని తమ అత్యాధునిక ఫ్యాక్టరీలో ప్రతి మోడ్యూల్‌ను కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలతో తయారు చేస్తున్న మోడ్యూలీ (MODULI).. అద్భుతమైన ఫినిషింగ్, మన్నిక, సుస్థిరతను అందిస్తుంది. విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్ విల్లాల నుంచి వాణిజ్య సముదాయాల వరకు ప్రతి మోడ్యూలీ (MODULI) నిర్మాణం డిజైన్ కచ్చితత్వం, ఆధునిక సౌందర్యం, ఇంజనీరింగ్ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్నారైలు, ఇతర ప్రాంతాల కస్టమర్ల సౌలభ్యం కోసం, డిజైన్ నుండి డెలివరీ వరకు అన్ని పనులను మోడ్యూలీ (MODULI) నిపుణుల బృందం పర్యవేక్షిస్తుంది. వేగం, సుస్థిరత, స్టైల్‌తో కస్టమర్ల కలలను మోడ్యూలీ (MODULI) నిజం చేస్తోంది. మరిన్ని వివరాలకు www.moduli.in ను లేదా +91-9154146900 సంప్రదించవచ్చు.






