The Cascades Neopolis: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ “ది కాస్కేడ్స్ నియోపోలిస్”

రూ. 3169 కోట్లతో 63 అంతస్తులతో 217 మీటర్ల ఎత్తైన నిర్మాణం
జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా మరియు అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ ప్రమోటర్ల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ అయిన జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్ఎల్ పి, ఈరోజు “ది కాస్కేడ్స్ నియోపోలిస్” (The Cascades Neopolis)పేరిట రూ. 3169 కోట్లతో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోన్నట్లు వెల్లడించింది. ఇది హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవనాన్ని పునర్నిర్వచించనుంది. దాదాపు 217 మీటర్ల ఎత్తుతో ఐదు 63 అంతస్తుల టవర్లు కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్, సమకాలీన డిజైన్, పర్యావరణ అనుకూల జీవనం మరియు స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ల అద్భుత సంగమంతో ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్‌గా (మార్చి 2030 నాటికి కొనుగోలుదారులకు అప్పగించడం లక్ష్యంగా పెట్టుకుంది) మారనుంది.
వ్యూహాత్మకంగా నియోపోలిస్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 7.34 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో 1,189 అద్భుతంగా రూపొందించబడిన 3BHK మరియు 4BHK అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి, ఇవి విశాలమైన 2,560 చదరపు అడుగుల నుండి ఆకర్షణీయమైన 4,825 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉంటాయి, వీటితో పాటు 54వ అంతస్తులో ప్రైవేట్ కొలనులను కలిగి ఉన్న 10 ప్రత్యేకమైన ట్రిపుల్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి. ఏడు అంతస్తులలో పార్కింగ్ (2 బేస్‌మెంట్ + 5 పోడియం) ఉండటం వల్ల అపార్ట్మెంట్ నివాసితులకు తగినంత స్థలం, భూమి మీద మరియు ఆకాశ హర్మ్య స్థాయి సౌకర్యాల పరంగా భరోసా కలుగుతుంది, సమగ్ర ఆరోగ్యం , పర్యావరణ బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చే లగ్జరీ మరియు స్మార్ట్ లివింగ్ స్పేస్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ ప్రాజెక్ట్ జాగ్రత్తగా రూపొందించబడుతుంది.
ప్రముఖ ప్రపంచ వాస్తుశిల్పులు భవిష్యత్ నిర్మాణాన్ని రూపొందించడానికి ముందుకు వచ్చారు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అనేక దశాబ్దాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ది కాస్కేడ్స్ రూపొందించబడుతుంది. యుహెచ్ఏ లండన్ (కాన్సెప్ట్ ఆర్కిటెక్ట్), కూపర్స్ హిల్ సింగపూర్ (ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్), స్టూడియో హెచ్ బి ఏ సింగపూర్ (ఇంటీరియర్ డిజైన్ – సౌకర్యాలు) మరియు బురో హాపోల్డ్ (యుకె) (స్ట్రక్చరల్ ఇంజనీరింగ్) వంటి ప్రముఖ ప్రపంచ కన్సల్టెంట్ల నుండి అమూల్యమైన సూచనలు మరియు సలహాలతో అభివృద్ధి చేయబడుతున్న ఈ టవర్లు ప్రకృతిలో ఉన్న జలపాతాల నుండి ప్రేరణ పొందాయి.
నివాసితులకు జీవన అనుభవాన్ని మెరుగుపరిచే రీతిలో భద్రతా సేవలు మరియు ధృవపత్రాలు క్విన్టెసెన్షియల్లీ ద్వారా అంతర్జాతీయ భద్రతా సేవలు నివాసితులకు అపూర్వమైన ప్రయోజనం చేకూరుస్తాయి; ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అనుభవాలను పొందేందుకు అనువుగా వివేకవంతమైన రీతిలో వ్యక్తిగతీకరించిన జీవనశైలి నిర్వహణ సేవలను అందించడం దీని లక్ష్యం. ప్రయాణం నుండి ప్రత్యేకమైన మరియు అనుకూలీకరించిన అభ్యర్థనల వరకు ప్రతిదానినీ తమ కస్టమర్ల కోసం సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకురావటమే వారి గ్లోబల్ నెట్‌వర్క్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్ట్ వెల్ ( WELL) ప్రీ-సర్టిఫికేషన్ (సాధించిన తర్వాత, ఇది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నివాస ప్రాజెక్ట్ కావచ్చు) మరియు ఐజిబిసి ప్లాటినం ప్రీ-సర్టిఫికేషన్‌ను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్యం, సంక్షేమం మరియు పర్యావరణ నిర్వహణ కోసం ప్రపంచ ప్రమాణాలను సాధించాలనే అచంచలమైన నిబద్ధతను ఇది ప్రదర్శిస్తుంది. ఈ ప్రాజెక్టులో విద్యుత్ పొదుపు వ్యవస్థలు, అధిక-పనితీరు గల నిర్మాణ సామగ్రి, కామన్ ఏరియాలకు సౌరశక్తి, వర్షపు నీటి సేకరణ మరియు ఇండోర్ వాతావరణాన్ని మెరుగుపరచడానికి అధునాతన గాలి శుద్దీకరణ వ్యవస్థలు భాగంగా ఉంటాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కార్బన్ పాదముద్రను గణనీయంగా తగ్గిస్తాయి మరియు పర్యావరణ అనుకూల జీవన పద్ధతులను ప్రోత్సహిస్తాయి
“జీవితం యొక్క నిజమైన సారాంశం శారీరకంగా మరియు భావోద్వేగంగా ఆరోగ్యంను పెంపొందించే ప్రాంగణాలను సృష్టించడంలోనే ఉందని మేము నమ్ముతున్నాము. నియోపోలిస్ ఒక ప్రాంతంగా అనేక పచ్చని ప్రదేశాలు మరియు ఇరువైపులా అధిక మొత్తంలో చెట్లను కలిగి వున్న విశాలమైన రోడ్లను కలిగి ఉంటుంది , ఇది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.” అని జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్ఎల్ పి భాగస్వామి, (జిహెచ్ఆర్ ఇన్‌ఫ్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) శ్రీ కార్తీష్ రెడ్డి ఎం అన్నారు. ఆయనే మాట్లాడుతూ “వీటితో పాటు, ది కాస్కేడ్స్ నియోపోలిస్ అనేది ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్ నుండి వెల్‌నెస్ జోన్‌ల వరకు సమగ్ర వెల్‌నెస్‌పై దృష్టి సారించడం ద్వారా విలాసవంతమైన జీవనానికి మించి ముందుకు సాగడానికి రూపొందించబడింది. ఇది అపార్ట్మెంట్ నివాసితులు కేవలం నివసించటానికి మాత్రమే కాకుండా అభివృద్ధి చెందడానికి సహాయపడే జీవన అనుభవాన్ని అందించడం గురించి… ” అని అన్నారు.
“మేము ఇక్కడ నియోపోలిస్‌లో అసాధారణమైనదాన్ని నిర్మిస్తున్నాము. దీనిని నిజం చేయడానికి మేము మా కొన్ని కీలక బలాలు లేదా ప్రత్యేకతలపై ఆధారపడుతున్నాము. ఆలోచన, యుఎస్ పి లు మరియు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయటం పరంగా మా అనుభవంపై మా నమ్మకం; రెరా రిజిస్ట్రేషన్‌తో సహా అవసరమైన అన్ని ఆమోదాలతో చట్టపరమైన అనుమతులు; ఎస్ బి ఐ నుండి రూ. 900 కోట్ల మంజూరు మరియు ప్రాజెక్ట్‌కు సజావుగా నిధుల ప్రవాహంతో సహా సరైన నిధి ప్రణాళిక; సకాలంలో పూర్తి చేయడం, ప్రాజెక్టులను నివాసితులకు చెప్పిన సమయానికి అప్పగించటమనే మా గ్రూప్ సంస్థల విశ్వసనీయత వంటి అంశాలపై మా నమ్మకాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ అంశాలు పెట్టుబడిదారులు మరియు కొనుగోలుదారులు, ఇద్దరి విశ్వాసానికి ఎల్లప్పుడూ దోహదపడతాయి” అని జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్ఎల్ పి యొక్క భాగస్వామి శ్రీ లక్ష్మీ నారాయణ జి (లక్ష్మీ ఇన్‌ఫ్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) వ్యాఖ్యానించారు.
“డెవలపర్లుగా, మేము ప్రతి ప్రాజెక్ట్‌కీ ప్రత్యేకమైనదాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. ఈ అభివృద్ధి దానికి నిజమైన నిదర్శనం” అని జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్ఎల్ పి భాగస్వామి శ్రీ శరత్ వి (అర్బన్‌బ్లాక్స్ రియాలిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు) వివరించారు. ఆయనే మాట్లాడుతూ “ప్రపంచ స్థాయి జీవన అనుభవాన్ని నిర్ధారించడానికి మేము తాజా డిజైన్ మరియు జీవనశైలి ధోరణులను జాగ్రత్తగా అనుసరిస్తున్నాము, నాణ్యమైన ఫీచర్లు మరియు సౌకర్యాలను మిళితం చేసాము, తద్వారా ప్రపంచ శ్రేణి జీవన అనుభవాలను అందించనున్నాము. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణలలో ఆకర్షణీయమైన గ్లాస్ లిఫ్టర్‌లతో కూడిన ప్రత్యేకమైన స్కై లాంజ్, రూఫ్‌టాప్ ఇన్ఫినిటీ పూల్‌ను కలిగి ఉన్న ఉత్కంఠభరితమైన స్కై గార్డెన్, ప్యాడిల్ టెన్నిస్, పికిల్ బాల్ కోర్ట్, అంకితమైన యోగా డెక్ మరియు అవుట్‌డోర్ జిమ్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో రెండు హెలిప్యాడ్‌లు, అన్ని టవర్లను అనుసంధానించే స్కై బ్రిడ్జి మరియు 200,000+ చదరపు అడుగుల విశాలమైన 7-అంచెల సౌకర్యాలు ఉంటాయి, వీటిలో విలాసవంతమైన 50,000+ చదరపు అడుగుల క్లబ్‌హౌస్ కూడా ఉంటుంది” అని అన్నారు.