Harish Rao: అరెస్టు చేసిన విద్యార్థుల ను వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఓయూ (OU) పర్యటన దృష్ట్యా విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెస్టు చేసిన విద్యార్థుల (Students) ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంపై నిషేదాజ్ఞలు విధిస్తారా? అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్(Job calendar) ను జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.






