హైదరాబాద్ నుంచి వియత్నాంకు నాన్‌స్టాఫ్ ఫ్లైట్ లు
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాం లోని మూడు నగరాలైన హనోయి, హోచిమిన్ డానాంగ్లకు వియట్ జెట్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్‌ను అక్టోబరు నుంచి నాన్‌స్టాఫ్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. ఈ సర్వీసులు దక్షిణ భారతదేశం నుంచి మొదటివని ఆయన పేర్కొన్నారు. హనోయికి అక్టోబర్ 7న, హోచిమిన్ సిటీకి అక్టోబర్ 9న డానాంగ్కు నవంబర్ 29న వియట్ జెట్ తొలివిమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నాన్నారు. వారానికి నాలుగు సార్లు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.






