కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయం : వంశీచంద్ రెడ్డి

కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీపీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వంశీచంద్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల కన్నీటీ గాథలు చెబుతూ పోతే చాంతాడంత ఉంటుందన్నారు. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేసారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను వంచించి కల్వకుంట్ల కుటుంబం బాగుపడిరది. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు, మేడిగడ్డను బొందపెట్టింది. మరోసారి మోసం చేయడానికే ఆ పార్టీ నాయకులు మేడిగడ్డ పర్యటనకు బయల్దేరారు. పాలమూరులో గత ప్రభుత్వ బండారం బయటపెడతాం అని అన్నారు.