హైదరాబాద్‌లో విన్సప్లై జీడీసీ సెంటర్
అమెరికాకు చెందిన విన్సప్లై సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ (జీడీసీ)ను ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కంపెనీ ప్రతినిధి క్రిస్టోఫర్ సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా తమ గ్లోబల్ డాటా సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు.కాగా, విన్సఫ్లై నిర్మాణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీలను ఆకర్షించడంలో హైదరాబాద్ ముందున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన మౌలిక సదుపాయాలను, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తున్నదన్నారు. అనంతరం క్రిస్టోఫర్ టీ`హబ్, టీ`వర్క్స్ కేంద్రాలను సందర్శించి అక్కడి వివరాలను తెలుసుకున్నారు.






