హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. అనంతరం ఓయూ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలి చేరుకొని, ఇప్లూ వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత బేగంపేట విమానాశ్రయానికి తిరిగి ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రేపు బేగంపేట విమానాశ్రయం నుంచి ఓయూ మార్గంతో పాటు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయా మార్గాల్లో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 వరకు ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు చేయనున్నట్లు సీపీ తెలిపారు.













