Supreme Court :సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా.. ప్రజలను తప్పుదోవ : మహేశ్ కుమార్ గౌడ్

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ (Mahesh Kumar Goud) అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తిపరం అవుతున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుందని చెప్పారు. ఏఐ ఫేక్ వీడియోలు (AI fake videos) చూసి ప్రధాని మోదీ (Prime Minister Modi) కూడా పొరపాటుపడ్డారన్నారు. ఫేక్ వీడియోలు అని తెలిశాక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఎక్స్‌లో పెట్టిన వీడియోలు తొలగించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఇచ్చాక కూడా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించింది. కేటీఆర్ తన అనుయాయులకు వేల ఎకరాలను అప్పనంగా కట్టబెట్టారు. ఎకరం రూ.100 కోట్లు పలికే భూములను రూ.30 లక్షలకే విక్రయించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు వేసింది అని విమర్శించారు.