TGPSC : బీఆర్‌ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు… వారంలోగా

బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి (Rakesh Reddy)పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీజీపీఎస్సీ) (TGPSC )పరువు నష్టం దావా వేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 (Group-1)ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి కమిషన్ నోటీసులు (Notices) ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధనమిచ్చి క్షమాపణలు చెప్పాలని కమిషన్ డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్ కేసులు (Criminal cases) బుక్ చేస్తామని హెచ్చరించింది. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయొద్దని రాకేశ్‌రెడ్డికి సూచించింది.