Engineer Kidnap: దక్షిణాఫ్రికాలో తెలుగు ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న తెలుగు ఇంజినీరును అక్కడి ఉగ్రవాదులు కిడ్నాప్ (Engineer Kidnap) చేశారు. యాదాద్రి జిల్లా బోర్వెల్ రిగ్ సంఘానికి చెందిన ఒక యువ ఇంజనీర్ మాలి దేశంలో పనిచేస్తున్నాడు. అతన్ని అక్కడి అంతర్జాతీయ ఉగ్రవాదుల కిడ్నాప్ చేసిన ఘటన ఆ ప్రాంతంలోకలకలంరేపింది. భువనగిరి మండలం, బండ సోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఒక బోర్వెల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
గత నవంబర్‌లో కంపెనీ అసైన్‌మెంట్‌పై మాలి దేశంలోని కోబ్రా ప్రాంతానికి వెళ్లాడు. గత నెల 23న తన షెల్టర్ వైపు వెళ్తుండగా జేఎన్ఐఎం ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులు అతన్ని కిడ్నాప్ (Engineer Kidnap) చేశారు. రోజూ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రవీణ్ ఆ రోజు నుంచి ఎలాంటి కాల్స్ చేయలేదు. దీంతో ఆందోళనలో ఉన్న ఆ కుటుంబానికి రెండ్రోజుల తర్వాత అసలు విషయం తెలిసింది. ఈ విషయాన్ని సౌతాఫ్రికాలోని అధికారులు కూడా ధ్రువీకరించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
“నా కొడుకు చురుకైనవాడు, సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం,” అని ప్రవీణ్ తండ్రి నల్లమాస జంగయ్య అన్నారు. ప్రవీణ్ పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి, ప్రవీణ్ విడుదల (Engineer Kidnap) కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జేఎన్ఐఎం ఉగ్రసంస్థ గతంలో కూడా విదేశీ పౌరులను కిడ్నాప్ చేసిన నేపథ్యంలో ఈ సంఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.






