అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి
అమెరికాలో మరో ప్రవాస తెలుగు వ్యక్తి మృతి చెందారు. తెలంగాణ (Telangana)లోని గద్వాల పట్టణానికి చెందిన జి.సునీల్ కుమార్ )G. Sunil Kumar(51) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఫ్లోరిడా (Florida)లోని టాంపా నగరంలో రెండు రోజుల క్రితం తన ఇంటి ఆవరణలోనే ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సునీల్ కుమార్ భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సునీల్ హఠాన్మరణంతో గద్వాలలోని ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కొన్నేళ్లు చెన్నై (Chennai)లో పనిచేసిన ఆయన మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ పనిచేస్తూ ఇటీవలే మరో కంపెనీకి బదిలీ చేయించుకున్నట్లు సునీల్ చిన్ననాటి స్నేహితులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అమెరికాలో అతడి సన్నిహితులతో పాటు తెలుగు సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






