Global Summit: తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్
తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ (Global Summit) కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ (Future City)లో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు.
గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రత్యేక వేదికను ఫ్యూచర్ సిటీలో రూపొందిస్తున్నారు. సమ్మిట్‌లో భాగంగా మూడు వేల డ్రోన్ల (Drones)తో షోను ఏర్పాటు చేస్తున్నారు. సమ్మిట్‌లో కీలక ఒప్పందాల చేసుకునేందుకు పలువురు పెట్టుబడి దారులు ముందుకు వస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కార్యక్రమానికి వీలైనంత మంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైతే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్రాల వారీగా ఆ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు.






