తెలంగాణలో అమెరికాకు చెందిన ట్రైటాన్ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వాహనాల తయారీకి తెచ్చిన పాలసీతో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయని, టెస్లాకు పోటీ సంస్థ అయిన అమెరికాకు చెందిన ట్రైటాన్ తన ఫ్యాక్టరీ ఏర్పాటుకు జహీరాబాద్‌లో స్థలాన్ని కేటాయించామన్నారు. బీఎం బిర్లా సైన్స్ మ్యూజియం భాస్కర ఆడిటోరియంలో ఇక్ఫాయ్ పూర్వ విద్యార్థులు శశాంక్, ఆదిత్య రూపొందించిన ఎలక్ట్రిక్ స్మార్ట్ సైకిల్‌ను ఆయన లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాటరీ సైకిళ్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునేందుకు టెక్నాలజీకి పెద్దపీట వేయాలన్నారు. ఎర్మిన్ ఆటోమోటిక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు, సీఈవో శశంక్ మాట్లాడుతూ మూడు వేరియంట్లలో ఏఐ అధారిత స్మార్ట్ సైకిల్‌ను రూపొందించామన్నారు.






