Venkaiah Naidu : ఆ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలి : వెంకయ్య నాయుడు

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం (Sanskrit) అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు విని విచారించానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచన చేయాలని కోరారు. విద్యార్థుల (Students) ను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు. అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలవబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం (National Education Policy) -2020 సైతం దానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.