Drone: యూఏఈ రికార్డు బద్దలు…3 వేల డ్రోన్లతో ఈజ్ రైజింగ్ ప్రదర్శన
గ్లోబల్ సదస్సు ముగింపు కార్యక్రమంలో భారీ డ్రోన్‌షో (Drone) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3 వేల డ్రోన్లను ఉపయోగించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జాయిన్ ది రైజ్ నినాదం, దానిపైన పెద్దగా ఒకటి అంకె, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్‌తో చేసిన డ్రోన్ విన్యాసం తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ సుదీర్ఘ వాక్యం గిన్నిస్ రికార్డులు (Guinness World Record) బద్దలు కొట్టాయి. గతంలో అబుధాబిలో 2,131 డ్రోన్లతో సుదీర్ఘ వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు ఉండగా, ఇప్పుడు తెలంగాణ రైజింగ్ షో (Telangana Rising Show) దాన్ని బద్దలు కొట్టింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రతిబింబించేలా చేసిన డ్రోన్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ షో అనంతరం బాణసంచా ప్రదర్శన అలరించింది. బాణసంచా మెరుపులతో సదస్సు ప్రాంగణం కాంతులీనింది.
– NS GOUD






