హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఇతర బీజేపీ నేతలు బహిరంగంగా ముస్లిం రిజర్వేషన్లపై ఎలా మాట్లాడుతున్నారని, వాటిని రద్దు చేస్తామని ఎలా చెబుతున్నారని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్లు సుప్రీం కోర్టులో ఉన్న అంశమని, అలాంటి అంశంపై బీజేపీ నేతలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. మోదీ, అమిత్ షాలు కావాలనే ఎన్నికల సమయంలో ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని, హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉంటారని, వాళ్లే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.