Revanth Reddy : పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ : సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆయన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ (Young India Police School ) ను ప్రారంభించి మాట్లాడారు. పోలీసు శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ (Nehru) స్థాపించినవేనని తెలిపారు. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహారావు(PV Narasimha Rao) . యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ (KG to PG) వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్‌ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్‌ను సమకూర్చుకోవాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని తెలిపారు.