Revanth Reddy:అధికారులను అప్రమత్తం చేయాలి :రేవంత్ రెడ్డి

తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో అధికారులతో సీఎం చర్చించారు. సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) , శ్రీధర్‌బాబు(Sridhar Babu) , సీతక్క (Seethakka) పాల్గొన్నారు. వరద ప్రభావిత జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కామారెడ్డి, మెదక్, కరీంనగర్ (Karimnagar) తదితర జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరచడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి.