Revanth Reddy: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ… ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : సీఎం రేవంత్

రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ (RRR ) సమీపంలోని భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా డ్రైపోర్ట్ నిర్మాణానికి రూపకల్పన చేయాలని సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్, జాతీయ రహదారులపై సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్(Hyderabad )-విజయవాడ (Vijayawada) గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) విస్తరణపైనా సమీక్షించిన సీఎం, ప్యూచర్ సిటీ (Future City) వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మెట్రో రెండో దశ ప్రతిపాదనలు , కేంద్రం అనుమతులపైనా సమీక్షించిన సీఎం ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు.