ఉన్నత విద్యలో భారత్ ఆదర్శం : రాష్ట్రపతి
ఉన్నత విద్యలో వందల సంవత్సరాల క్రితమే భారత్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. వందేళ్ల క్రితం ఇదేరోజు ఇక విజన్‌తో ఓయూ ప్రారంభమైందన్నారు. ఓయు అత్యున్నత విశ్వవిద్యాలయం అని ఆయన అన్నారు. వందేళ్ల క్రితం మీర్ ఆలీ ఉస్మాన్ ఖాన్ దీన్ని ప్రారంభించారు. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించాం. ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఐఐటీలో చదివిన వారికి వంద శాతం ప్లేస్మెంట్ లభిస్తోంది. మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాయాలు వేదికలుగా నిలుస్తున్నాయి. మేధావులు, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలి. పారిశ్రామిక అంశాలకు దోహదపడేలా యూనివర్శిటీల్లో పరిశోధనలు జరగాలి అని అన్నారు. 15వ శతాబ్దంలోనే నలంద యూనివర్శిటీ ఏర్పాటైంది. 1956లో యూజీసీ ఏర్పాటైందని, నాటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో యూజీసీ ఏర్పాటైందని, యూనివర్శిటీలన్నీ యూజీసీ కిందికొచ్చాయి అని ప్రణబ్ అన్నారు.






