Bhubharati : పేదలకు అండగా ఉండేందుకు ఈ చట్టం : మంత్రి పొంగులేటి

ధరణిలో తమ భూమి నమోదు కాలేదని బీఆర్‌ఎస్ నేతలే చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్‌లో భూభారతి (Bhubharati)పై ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణి లోపాలను సరిద్దాలని మాజీ మంత్రు(Former Ministers )లు కోరుతున్నారు. వివరాలు తప్పుగా నమోదయ్యాయని చెబుతున్నారు. భూభారతి బిల్లు అసెంబ్లీ (Assembly)లో పెడితే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదలకు అండగా ఉండేందుకు ఈ చట్టం తీసుకువచ్చాం. భూ భారతి చట్టం దేశంలోనే రోల్‌మోడల్ కాబోతోంది. ధరణి (Dharani) అమలులో ఉన్నపుడు అధికారుల వద్ధకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారు. ఒక్క రూపాయి లేకుండా దరఖాస్తు చేసే అవకాశం వచ్చింది. పేదలకు చెందిన వేల ఎకరాలను గత ప్రభుత్వం కొల్లగొట్టింది. గతంలో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ చేసి పేదలకు పంచుతాం. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన పేదలకు ఇస్తాం. కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కారిస్తాం. గతంలో పాసు పుస్తకం ప్రకారం కాకుండా భూమి ఎక్కువో తక్కువో ఉండేది అని అన్నారు.