హైదరాబాద్ లో పినాకిల్ కార్యాలయం
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే పినాకిల్ హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. కో వర్కింగ్ సేవలను అందించే స్కూటర్ ఇందుకోసం 21,000 చదరపు అడుగుల కార్యాలయాన్ని అందించనుంది. ఈ అద్దె లావాదేవీని స్థిరాస్తి సేవల సంస్థ కొలియర్స్ ఇండియా పూర్తి చేసింది. హార్డ్వేర్, సాఫ్ట్ వేర్, నెట్వర్కింగ్ సొల్యుషన్ల సంస్థ పినాకిల్ మనదేశంలో ఏర్పాటు చేయనున్న తొలి కార్యాలయం ఇది. హైదరాబాద్లోని మై హోమ్ ట్విజా లో స్కూటర్ 3 లక్షల చదరపు అడుగుల స్థలంలో కో వర్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మొత్తం 3,500 సీట్ల సామర్థ్యం ఉంఒది. ఇందు కోసం 350 సీట్ల వరకూ పినాకిల్ తీసుకుంది. ప్లెక్సి బుల్ పని ప్రదేశానికి గిరాకీ పెరుగుతోందని ఈ సందర్భంగా స్కూటర్ సహ వ్యవస్థాపకుడు పునీత్ చంద్ర తెలిపారు. స్కూటర్కు హైదరాబాద్లో 5 లక్షల చదరపు అడుగుల కోసం వర్కింగ్ స్థలం ఉందన్నారు. ఐటీ, తయారీ, ఆర్థిక సేవల రంగాల నుంచి కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరుగుతోందని కొలియర్స్ ఇండియా పేర్కొంది.






