Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది సుప్రీం కోర్టు (Supreme Court). డిసెంబర్ 25 వరకు కస్టోడియల్ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నిన్నటి (గురువారం) ప్రభాకర్ రావు వారం రోజుల కస్టోడియల్ విచారణ పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే ట్యాపింగ్ కేసులో మరికొన్ని రోజులు విచారణ చేయాలని సుప్రీంకోర్టును సిట్ కోరింది. వారం రోజుల కస్టోడియల్ విచారణ రిపోర్ట్‌ను ఉన్నత న్యాయస్థానానికి సిట్ అందజేసింది. దీంతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణను వారం రోజుల పాటు పొడిగింపుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావును విడుదల చేయాలని, తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. పోలీసుల (Police) దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది.






