Kishan Reddy: ఆధారాలున్నా.. లేవని చెప్పడం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పార్టీ ఫిరాయింపుల అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తన నివాసంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ (Speaker) తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఫిరాయింపుల చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీవీల ముందు, ప్రజల ముందు కొందరు ఎమ్మెల్యేలు (MLAs) పార్టీలు మారినట్లు స్పష్టం చేశారని, కాంగ్రెస్ (Congress) కు అనుకూలంగా ప్రచారం చేశారని, ఇన్ని ఆధారాలున్నా, వారు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారకరమని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు నిబంధనలను నీరుగార్చాయని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), రాజ్యాంగాన్ని చేతపట్టుకొని తిరగడం కాదని, తెలంగాణలో రాజ్యాంగాన్ని ఎలా అవమానిస్తున్నారోచూసి చర్యలు తీసుకోవాలని సూచించారు.






