Nara Lokesh: యువత భవిష్యత్తుపై జగన్ కు ఇంత ద్వేషమెందుకు ? : లోకేశ్
ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై వైసీపీ (YCP) కుట్ర చేస్తోందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా వంటి సంస్థలపై కోర్టు (Court)లో వైసీపీ పీల్ వేసిందన్నారు. తాజాగా రహేజా ఐటీ పార్కు (Raheja IT Park) పైనా పిల్ దాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులతో ఏపీ యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు అందించే అవకాశముంది. యువత భవిష్యత్తుపై జగన్కు (Jagan) ఎంత ద్వేషమెందుకు? రాష్ట్రానికకి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన సబబా? అని లోకేశ్ నిలదీశారు.






