Rammohan Naidu: సీఎం చంద్రబాబు సమక్షంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమక్షంలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడి (Rammohan Naidu) జన్మదిన వేడుకలు జరిగాయి. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం, పార్టీ ఎంపీల సమక్షంలో రామ్మోహన్ నాయుడి చేత కేక్ కట్ చేయించారు. పార్లమెంటులో మంత్రి జన్మదిన వేడుకలను పార్టీ పార్లమెంటరీ కార్యాలయంలో టీడీపీ ఎంపీలు నిర్వహించారు. మరోవైపు అశోకా రోడ్‌లోని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడి అధికారిక నివాసంలో మధ్యాహ్నం జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిగాయి. ప్రధాని మోదీ (Modi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జి.కిషన్‌రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) రామ్మోహన్నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు.






