ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం
ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి వెలిగించి ఈ వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మేయర్ బొంతు రామ్మోహన్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ శతజయంతి ఉత్సవాలకు ఓయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఓయూలో ఎక్కడా చూసినా సందడి వాతావరణం ఏర్పడింది. శతాబ్ది వేడుకల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్సీసీ గేటు నుంచి తార్మాక వరకు ఉస్మానియా వర్సిటీ విశిష్టతను తెలియజేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. శతాబ్ది వేడుకల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.






