26న ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 26వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నారని ఓయూ వీసీ రామచంద్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. కాగా గవర్నర్లు నరసింహన్, సీహెచ్ విద్యా సాగర్ రావు, కేంద్ర మంత్రులు జవదేకర్, దత్తాత్రేయ, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తదితరులు ఈ ఉత్సవాలకు హాజరవుతారని తెలిపారు. అలాగే ఎంట్రీ పాస్‌ల కోసం విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా మొత్తం 15వేల మందికి సరిపడ్డా ఏర్పాట్లు చేసినట్ల తెలిపారు.













