Mahesh Kumar Goud: మహేశ్ కుమార్ గౌడ్ .. దానికి మీరు సిద్ధమా? : రఘునందన్ రావు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బాధ్యత మరిచి మాట్లాడుతున్నార ని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao ) విమర్శించారు. ఓటు చోరీపై పీసీసీ అద్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై రఘునందన్‌రావు ఘాటుగా స్పందించారు. మా పార్టీ ఎంపీలందరం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. దానికి మీరు కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. రాజీనామా చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాల్లో మేమే గెలుస్తాం కదా. మీరెందుకు 8 ఎంపీ స్థానాలు గెలుస్తారు? అసదుద్దీన్ (Asaduddin) ఎలా గెలుస్తారు. దమ్ముంటే మీ 8 మంది ఎంపీలతో రాజీనామా చేయించండి. మేమూ రాజీనామా చేస్తాం. కొత్త ఓటర్ లిస్ట్‌తో మళ్లీ ఎన్నికలకు వెళ్దాం. అప్పుడు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుస్తాయి. బీజేపీని అడిగి కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) హామీ ఇచ్చారా? కుంటి సాకులు చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయాలి. కాళేశ్వరంపై నిజాయితీగా కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ లోపంతోనే యూరియా కొరత ఏర్పడిరది. ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు.







