MP Chamala : ఆయన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు : చామల కిరణ్‌కుమార్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఖండిరచారు. కేటీఆర్ (KTR ) నోటికొచ్చినట్లుగా మాట్లాడి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. టీజీఐఐసీ (TGIIC) కి ఐసీఐసీఐ బ్యాంకు (ICICI Bank) రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. టీజీఐఐసీ ఫేస్ వాల్యూ చూసి 27 కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయని, తద్వారా వచ్చిన డబ్బులే ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా టీజీఐఐసీలో పడ్డాయని వివరించారు. ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో, కంచ గచ్చిబౌలి భూములు, హెచ్‌సీయూ, అటవీ శాఖవి కాదని తేలిపోయిందని కిరణ్‌కుమార్ అన్నారు. పేద ప్రజలు సన్న బియ్యం అన్నం తింటుంటే, బీఆర్‌ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు.