టీఎస్ కాదు టీజీ.. రేపటి నుంచే అమలు

ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్‌ను టీజీగా మారుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శుక్రవారం( మార్చి 15) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు అన్నీ ఇకపై టీజీగా వస్తాయని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణచివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకున్నాం. శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మార్చాలని కేంద్రానికి పంపించాం. అందుకు ఆమోదం లభిస్తుంది. గత ప్రభుత్వం మాదిరిగా జీవోలను రహస్యంగా ఉంచాలనుకోవడం లేదు అని స్పష్టం చేశారు.