రమ్యకు కేటీఆర్ భరోసా
అమెరికాలో నాసా నిర్వహిస్తున్న సెమినార్‌కు వెళ్లడానికి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన పోటీల్లో ప్రపంచంలోనే ద్వితీయ స్థానం పొందిన మెదక్‌కు చెందిన రమ్యకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స ప్రథమ సంవత్సరం చదువుతున్న రమ్యతో పాటు.. మరో నలుగురు విద్యార్థుల బృందం వచ్చే నెల 25న అమెరికాలోని సెయింట్ లూయి్సలో నాసా నిర్వహించనున్న సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.













