వీసా మార్పులపై అవగాహన కల్పించండి
పలు దేశాల్లో వస్తున్న వీసా నిబంధనల మార్పులపై ప్రవాస తెలంగాణవారికి అవగాహన కల్పించాలని ఎన్నారై టీఆర్ఎస్ విభాగాలను మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కోరారు. టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన వివిధ దేశాల ఎన్నారై టీఆర్ఎస్ విభాగాల అధ్యక్షులు మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలను క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా ప్రవాస తెలంగాణ వాళ్లు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయడం, విదేశాల్లో వస్తున్న వీసా నిబంధనల మార్పులు తదితర అంశాలపై చర్చించారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవితను కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎన్నారై విభాగాల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, న్యూజిలాండ్ టీఆర్ఎస్ అధ్యక్షుడు విజయ్ కోస్నా, టీఆర్ఎస్ లండన్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు సతీశ్‌కుమార్ రాదారపు, డెన్మార్క్ శాఖ అధ్యక్షుడు జయచందర్, అమెరికా నుంచి వచ్చిన మోహన్ గోలి తదితరులు ఉన్నారు.






