హైదరాబాద్ లో లులు మాల్
హైదరాబాద్‌లో లులు మాల్‌ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు యూఏఈ కేంద్రంగా ఉన్న లులు గ్రూపు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఒక మాల్‌ను పునరుద్ధరణ చేసి, 2023 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకొస్తామని లులు గ్రూపు షాపింగ్ మాల్స్ డైరెక్టర్ శిబు ఫిలిప్స్ వెల్లడిరచారు. దేశంలోని కోచి, త్రివేండ్రం, త్రిస్సూర్, బెంగళూరు, లఖ్నపూలలో కలిసి 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ను రూ.7 వేల కోట్లతో నెలకొల్పినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో సహా మరికొన్ని నగరాల్లో 12 కొత్త మాల్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.






