మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : కేటీఆర్

మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్‌ఎస్ నేతల బృందం పరిశీలించింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్ధంలో పెట్టి పెద్దదిగా చూపిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు, రూ.లక్ష కోట్లు వృథా చేశారంటూ అధికార పార్టీ దుష్ప్రచారం చేయడం సరికాదు. పగ, కోపం ఉంటే రాజకీయంగా మాపై తీర్చుకోండి. రైతులు, రాష్ట్రంపై వద్దు అన్నారు. 1.6కి.మీ బ్యారేజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమ్యస ఉంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నట్లుగా అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయి. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లువచ్చాయి. వాటీపై మేం రాజకీయాలు చేయలేదు. నిపుణుల సలహాలు తీసుకొని వరదలు వచ్చేలోగా మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నాం అని తెలిపారు.