ఈ నెల 12న కరీంనగర్ లో కదన భేరీ : కేటీఆర్

లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్‌ఎస్ నేతలతో ముస్తాబాద్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్లలోనూ ఎల్‌ఆర్‌ఎస్‌పై నిరసన తెలపాలన్నారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. డిసెంబర్ 9న అన్ని హామీలు నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని తెలిపారు. కరీంనగ్‌కు బండి సంజయ్ చేసిందేమీ లేదని మతం, అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ఈ నెల 12న కరీంనగర్‌లో కదన భేరీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.