పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన చంద్రయ్య
హైదరాబాద్లోని ఎల్బి నగర్, ఎన్టీఆర్ నగర్ వెజిటబుల్ మార్కెట్ ప్రక్కన ఉన్న ఓ కాలనీలో కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గౌరవ చైర్పర్సన్ జస్టిస్ గుండా చంద్రయ్య హాజరై సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలను అందించేటువంటి పోలీసులు, డాక్టర్లు, మునిసిపల్ వర్కర్లు మొదలగు వారి సేవలను కొనియాడారు. వారిని గౌరవించడం, సహకరించడం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమము లో స్టార్ 9 న్యూస్ ఛానల్ అధినేత షాబుద్దీన్, సోషల్ వర్కర్ ఏబోసు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






