హైదరాబాద్‌లో ఇనోవాలన్ సెంటర్
అమెరికాకు చెందిన క్లౌడ్ ఆధారిత సేవలందిస్తున్న కంపెనీ ఇనోవాలన్ హైదరాబాద్‌లో ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) ప్రారంభించింది. హెల్త్‌కేర్ తదితర రంగాలలోని కంపెనీలకు క్లౌడ్ ఆధారిత వినూత్న సొల్యూషన్లను అందించడానికి హైదరాబాద్ కేంద్రం దోహదం చేస్తుందని ఇనోవాలన్ ప్రెసిడెంట్ ఎర్న్ కెల్లీ తెలిపారు. ఖాతాదారులకు ఇంజీనిరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలను అందిచడానికి భారత్‌లో కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్న బృందాన్ని గత ఎనిమిదేళ్లుగా ఇనోవాలన్ వినియోగించుకుంటుంది. వీరు ఇప్పుడు కంపెనీ ఉద్యోగులవుతారు. ఇనోవాలన్కు హైదరాబాద్‌లోని ఐడీసీ అతిపెద్ద సింగిల్ ఇంజినీరింగ్ కార్యాలయం అవుతుంది.






