జపాన్ కంపెనీతో ఐఐటీహెచ్ ఎంవోయూ
ఐఐటీ హైదరాబాద్ మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. విద్యా, పరిశ్రమల పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు జపాన్‌కు చెందిన కంపెనీ బియాండ్ నెక్ట్స్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (బీఎన్వీఐ)తో ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీహెచ్, బీఎన్వీఐల మధ్య ఈ అవగాహన ఒప్పందం ఇండో-జపాన్ సహకారం తదుపరి దశలోకి ప్రవేశించిందనడానికి రుజువన్నారు. స్టార్టప్‌లు, వాటి పర్యావరణ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. కాగా ప్రయోగశాలలో ప్రారంభ దశ సాంకేతికతల నుంచి సామాజికతల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఓపెన్ ఇన్నోవేషన్ గురించి బీఎన్వీఐ తత్వశాస్త్రానికి తాను గట్టిగా మద్దతు ఇస్తున్నట్టు మూర్తి ప్రకటించారు.






