Hilt Policy: కాంగ్రెస్ ఏం చేసినా.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి అడ్డుకునే ప్రయత్నం : మంత్రి శ్రీధర్ బాబు
హిల్ట్ పాలసీ (Hilt Policy)లో భూ వినియోగ మార్పిడి రుసుము అనేది సొంత భూములు ఉన్న పరిశ్రమలకే వర్తిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పష్టంచేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని ఉంటే, హిల్ట్ పాలసీ వర్తించబోదని తెలిపారు. ఈ విషయం తెలిసీ బీఆర్ఎస్(BRS), బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న మూడు ప్రధాన పారిశ్రామిక పార్కుల్లో లీజులో ఉన్న ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించిందని, బీజేపీ (BJP) నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. సిరీస్ అనే ఫార్మా కంపెనీకి వంద ఎకరాల భూమిని దారాధత్తం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా, బీఆర్ఎస్, బీజేపీ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం బారిన పడకూడదన్న ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చామన్నారు. దీనికి నాచారం ఇండస్ర్టీయల్ అసోసియేషన్ (Nacharam Industrial Association) మద్దతు తెలిపిందన్నారు. హిల్ట్ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైన తర్వాత అభ్యంతరాలుంటే, తెలియజేయాలని సూచించారు. ఈ పాలసీపై రాహుల్‌కే కాదు, ఇంకెవరికైనా కేటీఆర్ లేఖలు రాసుకోవచ్చన్నారు.






