Telangana: కాంగ్రెస్‌ది ప్యూర్ కాదు పక్కా ‘చోర్’ విధానం: హరీశ్ రావు
Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆయన ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆర్థిక గణాంకాలతో అటాక్:
రాష్ట్ర జీఎస్డీపీ (GSDP), తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని హరీశ్ రావు గణాంకాలతో వివరించారు.
వృద్ధి రేటు పతనం: “బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 12.1% ఉండగా, అది ఇప్పుడు 10.2%కి పడిపోయింది. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే” అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
చోర్ విధానం: కాంగ్రెస్‌ది క్యూర్, ప్యూర్ విధానం కాదని.. అది కేవలం ‘చోర్ విధానం’ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డిపై విమర్శలు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. “ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ చేతగానితనం మరోసారి బయటపడింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై, అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారు” అని ఆయన ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి






